Tuesday, November 19, 2024

తెలంగాణ వైసిపిలోకి పొంగులేటి?

సీఎం జగన్‌తో భేటీ
షర్మిలకు మద్దతు ప్రకటించే అవకాశం
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని నిర్ణయం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చలు
రాజకీయవర్గాల్లో మొదలైన కొత్త చర్చ

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: వైయస్‌ కుటుంబానికి విధేయుడు, తెలంగాణ సీనియర్‌ నేత మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌కు గత కొంత కాలంగా దూరంగా ఉంటూ తెలంగా ణలో అధికారంలో ఉన్న ఆపార్టీ నేతలపై దూకుడుగా వ్యవ హరిస్తున్న పొంగులేటి త్వరలో తెలంగాణ వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొంగు లేటి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. 2014 రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీచేసి గెలుపొందిన పొంగులేటి ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలతో వైయస్‌ షర్మిల పార్టీవైపు మొగ్గు చూపుతున్న ట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో షర్మిలతో కలిసి ఖమ్మం జిల్లా నుండి ఆయన కూడా పోటీ చేయాలని యోచి స్తున్నట్లు తెలుస్తోంది.

ఆదిశగానే షర్మిలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు పాత్ర పోషించాలని ఇప్పటికే పొంగులెటి నిర్ణయానికి వచ్చి నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే సీఎం జగన్‌తో భేటీ అయ్యారన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో తెలంగాణలో వైసీపీ నుండి పోటీ చేసి పొంగులేటి ఆ తరువాత కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఆపార్టీ నుండి పోటీచేశారు. అయితే, గత కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన దూరంగా ఉంటూ వస్తు న్నారు. త్వరలోనే ఆపార్టీకి రాజీనామా చూడా చేయాలని సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తెలంగాణ వైసీపీలో చేరి షర్మిలకు అండగా నిలవాలని నిర్ణయించుకు న్నారు. అయితే, కేసీఆర్‌కు దూరమయ్యాక ఆయన ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీలో చేరాలని యోచించినప్ప టికీ తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కాషాయి కండువ కప్పుకోవడానికి పొంగులేటి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

తెలంగాణ వైసీపీలో చేరికకు రంగం సిద్ధం
వైయస్‌ కుటుంబానికి వీర విధేయుడిగా ముద్రపడ్డ పొంగులేటి శ్రీనివాస రెడ్డి త్వరలోనే తెలంగాణ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్‌ షర్మిల సారథ్యం వహిస్తున్న ఆ పార్టీలో చేరి మరోసారి తన సత్తా చాటుకోవాలని యోచిస్తున్నారు. అందు లో భాగంగానే గతంలో షర్మిలతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలోనే షర్మిల ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాతోపాటు తెలం గాణలోని వివిధ ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని కలిగిన పొంగులేటి తెలంగాణ వైసీపీలో చేరితే ఆయనకు ప్రాథాన్యత కలిగిన పదవితోపాటు వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుండి బరిలోకి దిగే అవకాశాన్ని కూడా షర్మిల కల్పించ నుంది. గతంలో ఇదే హామీ కూడా ఆయనకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన ఆపార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తన అభిప్రా యాన్ని ఏపీ సీఎం జగన్‌తో పంచుకోవడంతోపాటు తెలంగా ణ రాజకీయాలపై చర్చించేందుకే శుక్రవారం ఆయన తాడేప ల్లి వచ్చినట్లు రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement