న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తమిళనాడు సంస్థాగత వ్యవహారాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించానని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇండియా పేరుతో ఏర్పడ్డ కూటమికి సీఐఏ ( కరప్షన్ ఇంక్లూసివ్ అలయన్స్ ) అని పేరు పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో నా భూమి, నా ప్రజలు పేరుతో జూలై 28 నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. జులై 29న జరిగే ఖమ్మం సభ గురించి కూడా అమిత్ షాతో మాట్లాడానని తెలిపారు.
Delhi | ప్రధాని, హోంమంత్రిని కలిసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి.. తమిళనాడు సంస్థాగత విషయాలపై చర్చ
Advertisement
తాజా వార్తలు
Advertisement