కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలు నేటి నుంచి బంద్ కానున్నాయి. ఈ మేరకు మెడికల్ కాలేజీలు మినహా స్కూళ్లు, కాలేజీలు, గురుకులాలు, హాస్టళ్లు మూసివేతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. విద్యాసంస్థలు మూతపడనున్నప్పటికీ యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు యథాతథంగా జరగనుండగా.. పాలిటెక్నిక్ పరీక్షలు మాత్రం వాయిదా పడ్డాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మేలో ఇంటర్, టెన్త్ పరీక్షలతో పాటు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణపై అప్పటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement