Friday, November 22, 2024

పాలిటెక్నిక్‌ కన్వీనర్‌ కోటా సీట్లు 26వేలు.. ప్రారంభమైన మొదటి విడత కౌన్సెలింగ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ పాలిటెక్నిక్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం 4637 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారు. ఈనెల 22 వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. రేపటి నుంచి ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 113 కాలేజీలుంటే అందులో 54 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్‌, 58 ప్రైవేట్‌ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 11892, ఎయిడెడ్‌ కాలేజీలో 230, ప్రైవేట్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 14700 ఉన్నట్లు పాలిసెట్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement