హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్)-2023 నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 16వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 24 వరకు అవకాశం కల్పించారు. మే 17న పాలిసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పరీక్ష ముగిసిన 10 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్ సంస్థల్లో పాలిటెక్నిక్ కళాశాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్ వర్సిటీలోని అగ్రికల్చర్, హార్టికల్చర్ వర్సిటీ, పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీల్లో తదితర కాలేజీల్లో ప్రవేశాలను కల్పించనున్నారు.