అమరావతి,ఆంధ్రప్రభ: పాలిసెట్ తుది దశ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్ట్ 30 నుండి ప్రారంభం కానుందని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, పాలిటెక్నిక్ అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అగస్టు 29వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అందుబాటులో రానుందన్నారు. విధ్యార్ధులు ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 1 వరకు ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకోవలసి ఉందన్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ లోపు నాలుగు రోజుల వ్యవధిలో ఐచ్చికాల ఎంపిక పూర్తి చేయాలని కన్వీనర్ స్పష్టం చేసారు. సెప్టెంబర్ 4 వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు నాలుగు రోజుల వ్యవధిలో విద్యార్ధులు అయా కళాశాలల్లో రిపోర్టు చేయవలసి ఉంటుందన్నారు. క్లాసులు ఇప్పటికే ప్రారంభం అయినందున విద్యార్థులు వేగంగా ప్రవేశాలు పొందాలని చదలవాడ నాగరాణి స్పష్టం చేసారు.
- Advertisement -