Friday, November 22, 2024

కాలుష్యం.. ఢిల్లి కంటే ముంబైలో దారుణం – ఎస్‌ఏఎఫ్‌ఆర్‌ నివేదిక

ముంబైలో ఢిల్లి కంటే పేలవమైన వాయు నాణ్యత నమోదైంది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎస్‌ఏఎఫ్‌ఆర్‌) ప్రకారం, ఢిల్లి వాయు నాణ్యత 156తో పోల్చితే, గరిష్టంగా నగర మొత్తం వాయు నాణ్యత సూచిక 283 వద్ద పేలవప్రదర్శనను చూపింది. గత కొన్ని వారాలుగా ఆర్థిక రాజధానీలో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నివాసితులు ముఖ్యంగా వృద్ధుల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు ఆరుబయటకు రావాలంటే సమస్యగా ఉందని అంటున్నారు. గాలి నాణ్యత క్షీణించడానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు నిర్మాణం, వాహన ఉద్గారాల వంటి బాహ్య కారకాలు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ అధ్వాన్నమైన ఏక్యూఐ 320, అంధేరిలో 318, మలాడ్‌లో 305, చెంబూర్‌లనో 301, భాండప్‌ 283, వర్లీలో 211, బోరివల్లిలో 193, కొలాబాలో 169, మజగావ్‌ 149 ఏక్యూఐ నమోదు కాగ, నవీ ముంబైలో అత్యంత దారుణంగా 32 ఏక్యూఐ నమోదు అయింది. ఎస్‌ఎఫ్‌ఆర్‌ డాష్‌బోర్డ్‌ ప్రకారం, ముంబై ఏక్యూఐ మూడు రోజుల తర్వాత కూడా పేలవమైన కేటగిరీలో ఉండే అవకాశం ఉంది. పీఎం 2.5 స్థాయిలు ఉంది. నవంబర్‌ 2022 నుంచి జనవరి 2023 శీతాకాలంలో ముంబై అత్యంత పేలవమైన ఏక్యూఐ నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement