Monday, November 18, 2024

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు కాలుష్య నియంత్రణ మండలి షాక్‌.. ఎరువుల ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశం..

రామగుండం, (ప్రభన్యూస్‌) : రామగుండం ఎరువుల కర్మాగారానికి కాలుష్య నియంత్రణ మండలి షాక్‌ ఇచ్చింది. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో 12 లక్షల గ్యారెంటీని జప్తు చేయడంతోపాటు ఎరువుల ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రామగుండం ఎరువుల కర్మాగారంలో వ్యర్థ రసాయనాలు గోదావరిలోకి వడల, అమోనియా లీకేజీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు ప్రజలు విన్నవించిన యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్‌ స్వయంగా కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్‌ బృందం క్షేత్ర స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నివేదిక అందజేసింది. దీంతో ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కర్మాగారం అధికారుల్లో ఆందోళన నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement