Thursday, November 21, 2024

వాహనదారులకు హెచ్చరిక.. ఆరునెలలు దాటితే జరిమానా

తెలంగాణ: కారు, బైక్ వంటి వాహనాలు ఉన్నవారు ఇకపై తప్పనిసరిగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. తెలంగాణలో వెలువడుతున్న వాయు కాలుష్యంలో దాదాపు 50 శాతం వాహనాల నుంచే వస్తున్నందున కాలుష్య కట్టడికి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి సరికొత్త విధానాన్ని తీసుకురాబోతుంది.

అందులో భాగంగా ఆరు నెలల గడువులోపు కాలుష్య పరీక్ష చేయించకపోతే ఆటోమేటిక్‌గా జరిమానా పడనుంది. పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలపై ‘ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విధానంలో వాహన కాలుష్య పరీక్ష, ఫలితాలు ఆన్‌లైన్ చేస్తారు. ఆ వివరాలు రవాణా, పోలీస్‌శాఖలకు చేరుతాయి. ఆగస్టులో ఈ విధానం తొలుత హైదరాబాద్‌లో అమలు చేయనున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా 1.38 కోట్ల వాహనాలు ఉండగా.. హైదరాబాద్‌లోని వాహనాల నుంచే రోజుకు 1,500 టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: గూగుల్‌కు రూ.4,415 కోట్ల జరిమానా

Advertisement

తాజా వార్తలు

Advertisement