క్షీణిస్తున్న ప్రపంచ మహా సముద్రాల ఆరోగ్యాన్ని ఎలా పునరుద్ధ రించాలనే దానిపై యుఎన్ సమావేశం సోమవారం లిస్బన్‌లో ప్రారంభమైంది. సోమవారం ప్రారంభమయిన ఈ సదస్సులో కలుషితమైన సముద్రాలు వెలుగులోకి వచ్చాయి. పోర్చుగల్‌లోని లిస్బన్ మొదలైన ఈ యుఎన్ ఓషన్ మొదటిరోజు సమావేశంలో ప్లాస్టిక్‌ల వల్ల, ఉద్గారాల కారణంగా ఆవ్లుంగా మారిన మహాసముద్రాలను ఎలా పున రుద్ధరించాలో నిపుణులు చర్చించారు. అలాగే ఫిషింగ్ ప్లీట్‌లకు అన్ని జాతీయ ఇంధన సబ్సిడీలను నిలిపివేయాలని ప్రపంచ నాయకులను కోరాలని కార్యకర్త లు తీర్మానించారు. ఈ సమావేశంలో వేలాదిమంది విధాన రూపకర్తలు, నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నా రు. మానవాళికి ఆరోగ్యకరమైన సము ద్రాలు అవసరం. మనం పీల్చే ఆక్సిజన్ లో 50 శాతం సముద్రాలు ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజు బిలియన్లమందికి అవసరమైన ప్రొటీన్లు, పోషకాలను అందిస్తాయి.
భూమి ఉపరితలంలో మూడింట రెండువంతులకంటే ఎక్కువ ఆవరించి ఉన్న ఏడు సముద్రాలు భూమిపై జీవనా నికి వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించాయి. గత 60 ఏళ్లలో ఉద్గారాలు సగానికి పైగా పెరగడంతో సముద్రపు నీరు ఆమ్లంగా మారింది. గ్లోబల్ వార్మింగ్ నుండి 90 శాతంకంటే ఎక్కువ వేడి వలన భారీ సముద్రపు వేడి తరంగాలు పుట్టుకొచ్చాయి. ఇవి విలువై న పగడపు దిబ్బలను చంపుతున్నాయి. ఆక్సిజన్‌లేని డెడ్ జోన్‌లను విస్తరిస్తున్నా యి. ప్రస్తుత పోకడల ప్రకారం 2060 నాటికి వార్షిక ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు మూడురెట్లు పెరిగి 1 బిలియన్ టన్నుల కు చేరుకుంటాయి. ఇటీవల ఓఇసిడి నివేదిక ప్రకారం మైక్రోప్లాస్టిక్-ఆర్కిటిక్ మంచు లోపల సముద్రపు లోతైన కందకాలలోని చేపలు ప్రతిసంవత్పరం మిలియన్ కంటే ఎక్కువ సముద్ర పక్షుల ను, లక్ష సముద్ర క్షీరదాలను చంపేస్తా యని అంచనా వేయబడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.