దేశ వ్యాప్తంగా 18 లోక్ సభకు సంబంధించి 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19న 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అటు రెండో విడతలో భాగంగా.. 88 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో మూడో విడతలో భాగంగా ఇవాళ 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మూడో దశలో అసోంలో నాలుగు, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌గఢ్‌లో ఏడు, గోవాలో రెండు, గుజరాత్‌లో 26, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్‌లో 4 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ఒకటి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలతో దేశంలో గుజరాత్, అస్సామ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. కాగా ఈ దశలో మొత్తం 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా గుజరాత్ సూరత్ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. మరో రెండు స్థానాల పోలింగ్ వివిధ కారణాలతో అయిదు దశలోకి మార్పు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.
బరిలో అమిత్ షా , డిగ్గి రాజా..ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో గుజరాత్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రుడు జ్యోతిరాధిత్య సింధియా (గుణ – మధ్య ప్రదేశ్) నుంచి బరిలో ఉన్నారు. పురుషోత్తం రూపాల రాజ్‌కోట్ నుంచి బరిలో ఉన్నారు. ప్రహ్లాద్ జోషి.. కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు మధ్య ప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిశ నుంచి బరిలో ఉంటే…. రాజ్ ఘర్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ ఉన్నారు. అటు కర్ణాటకలోని హవేరి నుంచి బసవరాజ్ బొమ్మై బరిలో ఉన్నారు.ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌కు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. దీంతో పాటు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన రెండో స్థానాలకు తర్వాత విడతలో ఎన్నికల నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 283 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో నాలుగు విడతల్లో 262 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు జరగనుంది.