ముంబై: టీ20 క్రికెట్లో వెస్టిండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 600వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా తన పేరును క్రికెట్ పుస్తకాలలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా లండన్ స్పిరిట్స్ తరఫున ఆడుతున్న పొలార్డ్, మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించాడు. పొలార్డ్ ఇప్పటి వరకు 600 టీ20 మ్యాచ్‌ల్లో 11,723 పరుగులు చేశాడు. 31.34 సగటు కాగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 104 పరుగులు. ఒక సెంచరీ సహా 56 అర్ధసెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 309 వికెట్లు పడగొట్టడం విశేషం. 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం అత్యుత్తమం. 2007 నుంచి క్రికెట్ ఆడుతున్న పొలార్డ్ ఆటశైలికి ఈ ఫార్మాట్ బాగా సరిపోతుంది.
దీంతో అతడు టెస్టులు, వన్డేల కంటే ఈ ఫార్మాట్లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. పొలార్డ్ అంతర్జాతీయ కెరీర్లో వెస్టిండీస్ తరఫున 123 వన్డేలు, 101 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఫ్రాంచూజీ క్రికెట్ జరిగినా కనిపించే పేరు పొలార్డ్‌ది అనడంలో సందేహం లేదు. టీ20ల్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో పొలార్డ్ ముందువరుసలో ఉంటాడు. ఐపీఎల్లో పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. పొలార్డ్ తర్వాత టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారిలో డ్వేన్ బ్రావో 543 మ్యాచ్‌లు, షోయబ్ మాలిక్ 472 మ్యాచ్‌లు, క్రిస్‌గేల్ 463 మ్యాచ్‌లాడారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.