Friday, November 22, 2024

విద్యార్థుల కంటే వైసీపీకి రాజకీయాలే ముఖ్యం : కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కంటే రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. బుధవారం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మను కలిసిన ఆయన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వేగవంతంగా తరలించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ఎన్నారై సెల్స్, హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా సేకరించిన తెలుగు సహా ఇతర విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందజేశామని వెల్లడించారు.

ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతాల నుంచి విద్యార్థుల తరలింపు కోసం తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించామన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు నాలుగు దేశాల్లో టీడీపీ ఎన్నారై సెల్స్ పని చేస్తున్నాయని కనకమేడల తెలిపారు. కేంద్రం విద్యార్థుల తరలింపుకు అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్య పడవద్దని ఆయన ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల వివరాలు తెలుసుకోవడం, కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందిందని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఢిల్లీలో నామమాత్రంగా ఏర్పాట్లు చేసి విద్యార్థులను తరలిస్తున్నామంటున్నారని విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement