హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు.. వివరాలు తెలియాల్సి ఉంది . కాగా,. ప్రగతి భవన్కు చేరుకున్న అఖిలేష్ యాదవ్కు సీఎం కేసీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి లంచ్ చేశారు.. అనంతరం విపక్షాల కలయికపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం .. బెంగుళూరు లోఈ నెల 17, 18 తేదిలలో విపక్షాలు రెండో విడత సమావేశం కానున్నాయి.. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్న అఖిలేష్ నేడు కెసిఆర్ ను కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది..
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి, మాజీమంత్రి ఎస్ వేణుగోపాలచారి తదితరులు అఖిలేష్ వెంట ఉన్నారు..
ఇక బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాదవ్కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ప్రగతి భవన్కు చేరుకున్నారు.