Friday, November 22, 2024

ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం.. అసెంబ్లిలో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం

ఫ్రాన్స్‌ రాజకీయాల్లో పెనుసంక్షోభం తలెత్తింది. జాతీయ అసెంబ్లికి ఈనెలలో రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు మేక్రాన్‌కు చెందిన అధికారపక్ష కూటమి మెజారిటీ సాధించలేకపోయింది. కరడుగట్టిన వామపక్ష, రైట్‌వింగ్‌ పార్టీలకు ఓటర్లు మద్దతు ప్రకటించారు. ఆయా పార్టీల కూటములు తమ సీట్ల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. సోమవారం ఉదయం వెల్లడైన ప్రాథమిక ఫలితాల ప్రకారం మేక్రాన్‌ ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే. భారీగా సీట్లు పెంచుకున్న లెఫ్ట్‌, రైట్‌ వింగ్‌ కూటములతోగాని, ఆ కూటముల్లోని వేరే పార్టీలతో గానీ కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో లేదా మళ్లిd ఎన్నికలకు వెళ్లడమో తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ రెండూ అంత సులువుగా జరిగే పరిస్థితులు కన్పించడం లేదు. ఫలితాల సరళిపై ఫ్రాన్స్‌లో ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దెబ్బ తగిలిందని, రాజకీయ సునామీ వచ్చిందంటూ అక్కడి పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి. గత ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికై రికార్డు సృష్టించిన ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌కు, అధికారపక్షానికి జాతీయ అసెంబ్లిd ఎన్నికల ఫలితాలు పెద్ద దెబ్బ. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లోని దిగువసభ జాతీయ అసెంబ్లిdలోని 577 స్థానాలకు జూన్‌ 12, 19 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత ఫలితాల్లో అధికార పక్షం మెరుగ్గానే సీట్లు పొందినప్పటికీ సోమవారం వెల్లడైన రెండో విడత ఫలితాల్లో బోర్లాపడింది. జాతీయ అసెంబ్లిdలో మెజారిటీ మేజిక్‌ మార్క్‌ 289. కాగా తాజా ఫలితాల్లో ఎలిసబెత్‌ బోర్నే సారథ్యంలోని అధికారపక్షం మధ్యేవాద పార్టీల సెంట్రిస్ట్‌ ఎన్‌సెంబల్‌ కూటమి (ఎన్‌సెంబల్‌ సిటోయెన్స్‌)కి కేవలం 234 స్థానాలే దక్కాయి. ఈ ఎన్నికల్లో మరో మూడు కూటములు పోటీ చేయగా జీన్‌లుక్‌ మెలెన్‌కాన్‌ సారథ్యంలోని న్యూప్స్‌ కూటమి (న్యూ ఎకోలాజికల్‌ అండ్‌ సోషల్‌ పీపుల్స్‌) ఖాతాలో అనూహ్యంగా 131 స్థానాలు చేరాయి. ఇక యూనియన్‌ ఆఫ్‌ రైట్‌ అండ్‌ సెంటర్‌ యూనియన్‌ (యూడీసీ)కి కూడా ఊహించని విధంగా 64 స్థానాలు, జోర్డాన్‌ బార్డెల్లా సారథ్యంలోని నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌) కూటమికి 89 స్థానాలు దక్కాయి. కాగా యూడీఎఫ్‌ సారథ్యంలోని ఎల్‌ఆర్‌ పార్టీ మద్దతుపై మేక్రాన్‌ ప్రభుత్వం ఆశలు పెట్టుకోగా ఆ పార్టీ సారధి క్రిస్టియన్‌ జాకబ్‌ తిరస్కరించారు. తాము విపక్షంగానే వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు అధికారపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారు. కరడుగట్టిన వామపక్ష, రైట్‌వింగ్‌ కూటముల్లో ఆధునిక భావాలున్నవారున్నారని, అంశాలవారీగా వారి మద్దతు కూడగట్టగలమని అధికార పక్షం భావిస్తోంది.

ఇలా రెండోసారి..

కానీ ఫ్రాన్స్‌ రాజకీయాల్లో ఇలాంటి ఫలితాలు గతంలో ఎన్నడూ లేవు.1988లో కూడా ఇలాగే అప్పటి అధ్యక్షుడు పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీ సాధించలేకపోయారు. పైగా సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే సామర్థ్యం, సంప్రదాయం ఫ్రాన్స్‌ రాజకీయాల్లో తక్కువ. తాజా ఫలితాల నేపథ్యంలో విస్తృత వామపక్ష కూటమి కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలను స్థూలంగా పరిశీలిస్తే మధ్యేవాద అధికారపక్షాన్ని కాదని కరడుగట్టిన వామపక్ష, దానికి పరస్పర విరుద్ధమైన రైట్‌ వింగ్‌ పార్టీలకు ఓటర్లు మద్దతు పలికారు. కాగా తాజా ఫలితాలు ప్రజాస్వామ్యానికి తగిలిన విద్యుదాఘాతమని ఆర్థికమంత్రి బ్రూనో లె మైరే వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు ప్రమదాకరమైనవని, ఫ్రాన్స్‌ భవితవ్యానికి సవాలు విసరడమేనని, ఎన్నో సమస్యలను దేశం ఎదుర్కోవలసి ఉంటుందని అధికారపక్షానికి చెందిన ప్రధాని ఎలిసబెత్‌ బోర్నో వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తక్షణం ఎన్నికలకు వెళ్లేందుకు అధ్యక్షుడు మేక్రాన్‌ సుముఖత చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన వామపక్ష కూటమి ఈ ఫలితాలు అధ్యక్షుడు మేక్రాన్‌కు చెంపపెట్టని సంబరాలు చేసుకుంటున్న తమ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆ పార్టీ సీనియర్‌ నేత జీన్‌ లుక్‌ మెలెన్‌చాన్‌ అన్నారు. 2017 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే మెలెన్‌చాన్‌ సారథ్యంలోని న్యూప్‌ మూడురెట్ల స్థానాలు గెలుచుకుంది.ఇక మరైన్‌ లె పెన్స్‌ సారథ్యంలోని కరడుగట్టిన రైట్‌ వింగ్‌ నేషనల్‌ ర్యాలీ పార్టీ కూటమి వందకుపైగా స్థానాలు గెలుచుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి ఆ పార్టీ విజయం సాధించడం విశేషం. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మేక్రాన్‌ ఇచ్చిన పన్నుల కోత, సంక్షేమ సంస్కరణలు, పదవీ విరమణ వయోపరిమితి పెంపు వంటి హామీలు అమలు చేయగలరన్న నమ్మకం కోల్పోవడంతో ఓటర్లు ఇతర పార్టీలవైపు మొగ్గు చూపినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాగా నిత్యావసర సరకులు ధరలు నియంత్రిస్తామి, పరవీ విరమణ వయోపరిమితి తగ్గిస్తామని, వారసత్వ రాజకీయాలను నిలువరిస్తామని, కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ అందేలా పరిశ్రమల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తామని, ఐరోపా సమాఖ్యపై ధిక్కారవైఖరిని ప్రదర్శిస్తూ న్యూప్స్‌ ప్రచారం చేసింది. కాగా ఫలితాల వెల్లడైన వెంటనే యూడీసీ కూటమి సారథి మెరైన్‌ హెనిన్‌-బీమాంట్‌లో మాట్లాడుతూ అధ్యక్షుడు మేక్రాన్‌ అహంకారపూరిత ధోరణి, అసమర్థత, ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఈ ఫలితాలకు కారణమని వ్యాఖ్యానించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement