ఎల్‌ఐసీ.. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి సన్నాహాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ పాలసీ ఇష్యూ కంపెనీ, పాలసీ బజార్ డాట్ కామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ అగ్రిగేటర్‌తో ఎల్‌ఐసీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పాలసీ బజార్ డాట్ కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీర్ సింగ్ మాట్లాడుతూ.. టర్మ్ అండ్ ఇన్వెస్టిమెంట్ పాలసీలను వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఎల్‌ఐసీకి సంబంధించిన అన్ని రకాల పాలసీలు ఇక తమ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంటాయని వివరించారు. పాలసీ చెల్లింపుదారులకు తమ సేవలను వినియోగించుకోవచ్చు అని అన్నారు. చిన్న స్థాయి పట్టణాలకు కూడా తమ సేవలను విస్తరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నాం..
పాలసీ బజార్-ఎల్‌ఐసీ మధ్య ఒప్పందంతో.. వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయని వ్యాఖ్యానించారు. ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌లో బిగ్ షాట్.. తమతో భాగస్వామ్యం కావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పాలసీ బజార్ డాట్ కామ్ కంపెనీని ఎఫ్‌బీ ఫిన్‌టెక్ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతున్నది. గతేడాది పబ్లిక్ ఇష్యూను కూడా జారీ చేసింది. 51 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పాలసీ బజార్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా ఎల్‌ఐసీతోనూ అగ్రిమెంట్ చేసుకుంది. లైఫ్, జనరల్, స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్‌ల సెగ్మెంట్‌లో రాణిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..