Tuesday, January 7, 2025

TG | డిప్యూటీ సీఎం కాన్వాయ్‌కి ప్రమాదం.. బోళ్తా పడ్డ పోలీస్ వాహనం !

తెలంగాణ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం వరంగల్‌కు వెళ్తుండగా జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఎస్‌ఐ చెన్నకేశవులు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారి ప్రాణాలకు ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement