బ్రిటన్ పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. చారానా కోడికి బారానా మసాలా.. అచ్చు ఈ సామెతలాగే ఉంది బ్రిటన్ పోలీసుల పనితీరు. 15కిలోల బరువున్న స్కూటర్‌ను తీసుకెళ్లేందుకు ఏకంగా 7.5 టన్నుల ట్రక్ వాడి నవ్వులపాలయ్యారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు.
పబ్లిక్ రోడ్లపై ఓ రైడర్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుండగా పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక భారీ ట్రక్ వెనుక భాగంలో ద్విచక్ర వాహనం తీసుకెళ్లారు. ఈ ఫొటోను బ్రిటన్‌లోని హియర్‌ఫోర్డ్ పోలీసులు తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్‌చేశారు. భారీ వాహనంపై చిన్నసైజు స్కూటర్‌ను తీసుకెళ్లడంపై అంతా మండిపడ్డారు. ఇలా ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. స్కూటర్‌ను మలిచి పోలీసుల కారులోనే తీసుకెళ్లవచ్చుకదా? అంత చిన్న స్కూటర్‌కు భారీ వాహనం వాడాలా? అని ఒకరు కామెంట్ చేశారు.