హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. లాక్ డౌన్ ఉండగా బయట ఎందుకు తిరుగుతన్నారని పోలీసులు రేవంత్ ని అడ్డుకున్నారు. గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేసేందుకు వెళుతున్న ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో అడ్డుకున్న పోలీసులు. లాక్‌డౌన్‌లో ఆయన పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. అయితే, తాను కంటోన్మెంట్ ఆసుపత్రికి జనరేటర్ ఇచ్చేందుకు వెళుతున్నానని పోలీసులకు రేవంత్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ, లాక్‌డౌన్ సమయంలో తిరిగేందుకు అనుమతి లేదని..కేటీఆర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి… మిమ్మల్ని అనుమతించలేమని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తనకు రాతపూర్వక ఆదేశాలు చూపాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అయినప్పటికి రేవంత్ రెడ్డి వాహనం ముందుకు వెళ్లకుండా పోలీసులు రౌండప్ చేశారు.
పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా… సిగ్గుందా కేటీఆర్… అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. లాక్ డౌన్ టైంలో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం నేరమా అని ప్రశ్నించారు రేవంత్. తాను స్థానిక ఎంపీని, నన్ను అడ్డుకోమని చెప్పే అధికారం ఎవరిచ్చారు ప్రశ్నించారు రేవంత్. గరీబోడి నోటికాడి కూడు లాగేసే ప్రయత్నం ఏమిటి.. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గంమని..ఇంత సిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా అంటూ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.