కృష్ణా జిల్లా : జిల్లావ్యాప్తంగా నాటుసారా తయారు చేసే ప్రాంతాలను గుర్తించి, అనువనువున శోధించి, నిఘావర్గాల సమాచారాన్ని మరింత పెంచి, నాటుసారా ఆనవాళ్లను కూకటివేళ్లతో సహా పెకలించేలా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ కార్యచరణ ప్రారంభించారు. ఎక్కడికక్కడ మెరుపుదాడులు నిర్వహించి బెల్లం ఊటలను ధ్వంసం చేయడమే కాక, సారా తయారీ దారులపై కేసులు నమోదు చేసి నాటుసారా నిర్మూలనకు నడుంబిగించారు కృష్ణా జిల్లా పోలీసులు.నాటు సారాను సమూలంగా నిర్మూలించే విధంగా , మిగిలిన నాటుసారా తయారీ కేంద్రాలపై అడపాదడపా దాడులు నిర్వహిస్తూ, పోలీసు, స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు నిఘా మరింత పెంచి, వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీస్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 1069 కేసులు నమోదు చేసి, మొత్తం 12524 లీటర్ల నాటుసారాను సీజ్ చేసి, ఈరోజు అందరి సమక్షంలో ధ్వంసం చేయడం జరిగిందని, నాటుసారా కట్టడికి అన్ని శాఖల సమన్వయంతో ఎంతో విజయవంతంగా కట్టడి చేయడం సాధ్యమవు తుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వారితో కలిసి జాబ్ మేళా ను నిర్వహించడం జరుగుతుందని, రిపీటెడ్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి పై నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను కాదని నాటు సారా తయారీ కి పాల్పడితే వారిపై మరింత కఠినంగా శిక్షించడమే కాక, వారిపై పీడీ యాక్ట్ ను కూడా అమలు పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర , బందరు డీఎస్పీ మాసుం భాష , ట్రాఫిక్ డిఎస్పి భరత్ మాతాజి , ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..