విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. 2019, 2020,2021 సంవత్సరానికి గాను రామగుండం కమిషనరేట్ లో 39 మందికి పోలీస్ సేవా పతకాలు వరించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సీపీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ సేవా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ఇస్తున్నాయన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు, క్రమ శిక్షణ, కమిట్మెంట్ కనబర్చిన పోలీసు సిబ్బందికి పోలీస్ సేవా పతకాల ఇవ్వడం ద్వారా పోలీసుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు వారి పని తీరును మెరుగు పర్చవచ్చన్నారు. ప్రతీ ఒక్క పోలీస్ ఉద్యోగి కూడా రిటైర్ అయ్యేలోపు పతకాలు సాధించాలని, సేవా పతకాలను అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తోటి వారికి ఆదర్శంగా ఉంటారన్నారు. సేవా పతకాలు అందుకున్న వారు ఇంతటితో ఆగకుండా రెట్టింపు ఉత్సాహంతో పని చేసి మరిన్ని పతకాలను సాధించాలన్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పతకాలను అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement