హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల తర్వాత ఔట్‌డోర్ లౌడ్ స్పీకర్లను నిషేధించారు. పబ్బులు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలను నిషేధించారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు