Monday, November 18, 2024

న్యూఇయ‌ర్ వేడుక‌లపై పోలీసుల ఆంక్ష‌లు ఇవి..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. పబ్‌లు, హోటళ్ళు, క్లబ్‌లకు మార్గదర్శకాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ నిన్న విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుక పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండు డోసులు తీసుకున్నవారికే వేడుకలకు అనుమతి ఉందని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితి మించి పాసులను జారీ చేయవద్దని, పార్టీల్లో డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవన్నారు. ఈనెల 31వ తేదీ రాత్రి అకస్మికంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, మాస్క్‌ లేకుండా కనిపిస్తే రూ.1000 జరిమానాల విధిస్తామన్నారు.

వేడుక‌ల్లో భౌతికదూరం పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వేడుకలకు రెండు రోజుల ముందే అనుమతి తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వేడుకల్లో నిధులు నిర్వహించే సిబ్బందికి 48 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపేతే ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. మహిళలపై వేధింపుల కట్టడికి షీ టీంలతో ప్రత్యేక నిఘా పెడతామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement