Saturday, November 23, 2024

పోలీసు ఉద్యోగార్థుల అలర్ట్‌.. ఆగస్టు 7న ఎస్‌ఐ, 21న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ అప్రమత్తమయ్యే విషయాన్ని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు వెల్లడించింది. పోస్టుల భర్తీ ప్రక్రియలో మొదట నిర్మించే ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు మాసంలో నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 7 వ తేదీన ఎస్సై ఉద్యోగార్ఢులకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే విధంగా తర్వాత రెండు వారాల అనంతరం అంటే ఆగస్టు 21 వ తేదీన కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు.

పోలీసు, అగ్నిమాపక, జైళ్ళ శాఖ, ఎక్సైజ్‌, రోడ్డు రవాణా శాఖల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీసు నియామక బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ నెల 20 తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల వివరాలను పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌ టికెట్లను జారీ చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులకు 200 మార్కులకు గానూ 30 శాతం అంటే 60 మార్కులు వస్తే అర్హత సాధించినట్లు, ఎవరైతే నిర్ణీత మార్కులను దాటుతారో ఆ అభ్యర్థులు తర్వాత పరీక్షలకు అర్హులవుతారు.\

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement