Thursday, November 21, 2024

National : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పోలీస్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ ….బోర్డు ఛైర్ ప‌ర్స‌న్ పై వేటు ..

పోలీసు పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల వేళ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్‌పర్సన్‌ రేణుకామిశ్రాను తొలగించింది. ఆమె స్థానంలో ఐపీఎస్‌ ఆఫీసర్ రాజీవ్ కృష్ణను నియమించింది.

కాగా, గ‌త నెల 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ప్ర‌శ్నాప‌త్రం లీక్‌ ఆరోపణలతో ఆదే నెల 24న ప్రభుత్వం ఆ ప‌రీక్ష‌ను రద్దు చేసింది. ఆరు నెలల్లో తిరిగి నిర్వహిస్తామని వెల్లడించింది. అలాగే స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్ తో దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపింది. బాధ్యులకు కఠినశిక్ష పడుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. ఈ నేప‌థ్యంలోనే ఛైర్‌పర్సన్‌ను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement