ఎంతో ఇష్టంగా పెంచుకున్న గేదెల పుట్టినరోజు చేశాడు. ఊరంతా పిలిచి భోజనాలు కూడా పెట్టించాడు. ఇదే మనోడి కొంపముంచింది. ఓవైపు కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుంటే నిబంధనలను అతిక్రమించి భోజనాలు పెట్టటం పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డొంబివిలి ప్రాంతానికి చెందిన కిరణ్ మాత్రే ఓ గేదెను పెంచుకుంటున్నాడు.
ఆ గేదె కు పుట్టినరోజు వేడుకలు చేయాలని భావించి ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి ఘనంగా చేశాడు. దీంతో నిబంధనలుఉల్లంఘించాడంటూ సెక్షన్ 229 కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయమై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ తో చర్చించుకుంటున్నారు.