లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని ఉమరై గ్రామంలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు సుమారు 300 మందికి పైగా అతిథులు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి కొందరు పారిపోయారు. సుమారు ఓ 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement