Tuesday, November 26, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్స్ 307, 323, 324,143,147,149 కింద మల్కాజ్‌గిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరో 15 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా రేపు బీజేపీ నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు బంద్ పాటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రకటన చేశారు. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడికి నిరసనగా బంద్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా అంతకు ముందు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. ‘అరేయ్ గుండుగా’ అంటూ సంభోదించిన ఎమ్మెల్యే మైనంపల్లి.. బండి సంజయ్ ఓ హుమనైజర్ అని మండిపడ్డారు. ‘నా ముందు బండి సంజయ్ ఓ బచ్చా. మైనంపల్లి కోసం అన్ని జిల్లాలు కలిసి వస్తాయి. మైనంపల్లి అంటే అందరికి హడల్’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

Advertisement

తాజా వార్తలు

Advertisement