Friday, November 22, 2024

దారుణం..కరోనా రోగిని చితకబాదిన పోలీసులు..

కరోనా పేషెంట్ కుటుంబ సభ్యులను పోలీసులు చితకబానిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఒక వృద్ధుడిని ఇద్దరు పోలీసులు పట్టుకోగా… మరో పోలీసు లాఠీతో ఆయనను చితకబాదారు. అంతేకాదు, ఇద్దరు మహిళలను కూడా దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధుడిని కొడుతున్న పోలీసులును అడ్డుకునేందుకు సదరు మహిళలు వెళ్లడంతో… వారిపై కూడా పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.

సిర్సోడ్ బంజరీ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ క్రమంలో కరోనా రోగిని ఆసుపత్రికి త‌ర‌లించేందుకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. దీంతో కరోనా రోగి కుటుంబసభ్యులు అతిన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆరోగ్య సిబ్బంది, వారి మధ్య మాటమాట పెరిగింది. రోగి బంధువులు సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బంధీగా ఉంచారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఖండ్వాలోని కరోనా రోగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులను సముదాయిస్తున్న తరుణంలో రోగి కుటుంబం పోలీసులపై కూడా దాడి చేయడం ప్రారంభించిందని ఖండ్వా సుపరింటెండెంట్ వెల్లడించారు. దీంతో ప్రతీకారంగా క‌రోనా రోగితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు కొట్టారని వెల్లడించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement