ఫ్రాన్స్‌లోని సెయింట్ ఎటియెన్లోని కాఫీ రోస్సినీ అనే పేరు ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో హాట్ హాట్ పిజ్జాలను సర్వ్ చేస్తారు. మరి అంతటి మంచి పిజ్జాలాను తయారు చేసే చెఫ్ పేరు ఎడ్గార్డో గ్రీకో. అయితే ఆ వ్యక్తిని రెస్టారెంట్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిజ్జా చెఫ్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అనుకుంటుంన్నారా.. మోజారెల్లా చీజ్, టాపింగ్స్‌తో సన్నని క్రస్ట్ పిజ్జాలను అందించే ఈ చెఫ్ ఇటలీలో హత్యలకు పాల్పడిన మాఫియాకా బాస్ అని వారి ఎంక్వైరీలో వెల్లడయ్యింది..
-ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
మాఫియా బాస్ ఎడ్గార్డో గ్రీకో ఇద్దరు వ్యక్తులను రాడ్ తో కొట్టి చంపి యాసిడ్‌లో కరిగించేశాడు. అట్లా దోషిగా నిర్ధారించారు పోలీసులు. 16 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఈ 63 ఏళ్ల వ్యక్తిని ఓ రెస్టారెంట్ లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఉన్న అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ ఈ మర్డర్స్ మిస్టరీని చేధించింది. 1990లో ఇటలీలో జరిగిన కొన్ని వరుస హత్యలకు ఎడ్గార్ గ్రీకో డాన్‌గా ఉండేవాడని ఇంటర్‌పోల్ ఏజెన్సీ వెల్లడించింది.
ఇటలీలోని పలెర్మోలోని హెల్త్ క్లినిక్‌లో మరో మాఫియా బాస్, మాటియో మెస్సినా డెనారోను సంచలనాత్మకంగా అరెస్టు చేసిన రెండు వారాల తర్వాత గ్రీకో అరెస్టు కన్ఫాం చేశారు. మూడు సంవత్సరాలుగా పిజ్జా చెఫ్‌గా పనిచేసిన గ్రెకోకి అత్యంత శక్తివంతమైన క్రైమ్ గ్రూప్ ‘ndranghetaతో సంబంధం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ డెంజరెస్ మాఫియా డాన్ ఒక ఫేస్బుక్ పోస్ట్ కారణంగా పట్టుబడ్డట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ గురించి ఫేస్బుక్ పేజీలో పోస్ట్ ను చూసి పోలీసు అధికారులు ఎడ్గార్డో గ్రీకో గుర్తించారు.
ఇటాలియన్ ద్వీపంలో ఉన్న ‘ndrangheta ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కొకైన్ అక్రమ రవాణాదారులలో ఒకటి. క్రైమ్ సిండికేట్లలో అతిపెద్ద డేంజరస్‌గా దీన్ని చెప్పుకుంటారు. ఇటీవలి కాలంలో యూరప్, బ్రెజిల్లో కూడా ‘ndrangheta గ్యాంగ్స్టర్లు అరెస్టు అయ్యారు.