జనగామ జిల్లాలో ఓ బాలికపై లైంగిక దాడి ఘటనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఇవ్వాల అరెస్టు చేశారు. చిల్లూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. కాగా, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు స్టేషన్ ఘనపూర్ ఏసీపీ రవిచందర్ తెలిపారు. లైంగిక దాడి వీడియోను సోషల్మీడియాలో పోస్టు చేసిన మరో అయిదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏదిపడితే అది షేర్ చేస్తే కఠిన చర్యలుంటాయని ఏసీపీ హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement