Friday, November 22, 2024

హుజురాబాద్‌లో ఇందిరా శోభన్‌ అరెస్ట్

హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఇందిరా శోభన్ చేపట్టిన ఉపాధి భరోసా యాత్రకు బ్రేక్ పడింది. ఆమె పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితమే పర్మిషన్ కోసం సీపీకి ఇందిరా శోభన్ లెటర్ పెట్టుకోగా.. మొదట పాదయాత్రకు అంగీకారం తెలిపిన పోలీసులు ఆ తర్వాత మాట మార్చారు. దీంతో ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఇందిరా శోభన్‌కు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం అందుతోంది.

దీంతో ఇల్లంతకుంట మండలంలోని ఓ ఆలయం లోపల ఇందిరాశోభన్ నిరసనకు దిగారు. అయితే పోలీసులు ఆలయంలోకి వెళ్లి బలవంతంగా ఇందిరా శోభన్‌ను అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి హుజురాబాద్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఇందిరా శోభన్ అరెస్టు చేయడం నిరసిస్తూ నిరుద్యోగులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇల్లంతకుంట చౌరస్తాలో ధర్నాకు దిగారు. మరోవైపు ఇటీవలే ఇందిరా శోభన్.. వైఎస్‌ షర్మిల పెట్టిన కొత్త పార్టీ వైఎస్‌ఆర్టీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రజల అభిష్టం మేరకే తాను… వైఎస్‌ షర్మిల పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె వివరించారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్‌‌లో ఇందిరా శోభన్ ఉపాధి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు.

ఈ వార్త కూడా చదవండి: హుజురాబాద్‌లో దళితబంధుపై ఇంటింటి సర్వే ప్రారంభం

Advertisement

తాజా వార్తలు

Advertisement