మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు అటు వైపు వెళ్లే దారులన్నింటినీ జల్లడపడుతున్నారు. ఇప్పటికే కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారుల వద్ద, మునుగోడుకు వెళ్లే రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగానే చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలీసులు చెక్‌పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో సోదాలు నిర్వహించగా భారీగా బంగారం పట్టుబడింది. కారులో దాదాపు మూడున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకుని బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దుబాయ్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఈ బంగారాన్ని తరలించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారాన్ని ముగ్గురు వ్యక్తులు తమ అండర్వేర్లలో దాచిపెట్టారు. పట్టుబడిన వారిని సుల్తానా, షరీఫ్, జావేద్‌లుగా పోలీసులు గుర్తించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement