Saturday, November 23, 2024

కరోనా వేళ వీటిని గూగుల్ సెర్స్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్తా..

కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యసహాయం కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్తా..? అంబులెన్స్‌ కోసమో, ఐసీయూ బెడ్‌ కోసమో గూగుల్‌లో చూపే నంబర్‌కు ఫోన్‌ చేస్తున్నారా? అయితే బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు డబ్బులు దండుకొంటున్నారు. ఇదే అదనుగా కొందరు సైబర్‌ దొంగలు.. తమ ఫోన్‌ నంబర్లు పెట్టి, ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా పే చేయాలని అడుగుతున్నారు. ఆ మొత్తం కట్టి వాళ్లు చెప్పిన ఆస్పత్రికి వెళ్తే అసలు విషయం బయటపడుతోందని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఫిర్యాదులు చాలా అందాయని వెల్లడించారు. గూగుల్‌లో ఉండే ఫోన్‌ నంబర్లను నమ్మి మోసపోవద్దని, ఆయా దవాఖానల, మెడికల్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లలోకి వెళ్లి కాంటాక్ట్‌ నంబర్లు తీసుకోవటం ఉత్తమమని సూచించారు. కరోనా రోగులు బంధువులు ముందుగానే సమాచారం సేకరించుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement