Sunday, November 10, 2024

పోకలకుంట కబ్జా.. ‘ఆంధ్ర‌ప్ర‌భ’ క‌థ‌నానికి స్పందన..

ఎల్లారెడ్డి, ప్రభ న్యూస్ : పట్టణంలో సాతెల్లి బేస్‌ పక్కన ఉన్న పోకల కుంటలో వెంచర్‌ నిర్వహకులు మట్టి నింపి కబ్జా చేస్తున్నార‌ని ఆంధ్రప్రభ దినపత్రికలో గత నెల లో 28వ తేదీ నాడు వచ్చిన కథనానికి స్పందించిన నీటి పారుదల శాఖ అధికారులు ..రెవెన్యూ అధికారులు స్పందించి, రెండు శాఖల అధికారులు గత నేల 29 వ తేదీ శుక్రవారం నాడు జాయింట్‌ సర్వే చేపట్టారు. సర్వే రిప్టో వచ్చే వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్ట వద్దని అధికారులు వెంచర్‌ నిర్వ హికులకు హెచ్చరించారు. అధికారులు ఎంత చెప్పిన కూడా వినకుండా దర్జాగా.. అక్టోబర్‌ 31 ఆదివారం టెంట్‌ వేసుకొని దర్జాగా పనిచేస్తున్నారని మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌ అక్కడ జరుతున్న పనులను ఆపివేసి టెంటు, కుర్చిలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు.

సోమవారం వారం స్పందించిన నీటి పారుదలశాఖ డి ఈ ఈ వెంకటేశ్వర్లు వెంచర్‌ నిర్వహకులు పోకల కుంట ఏన్‌ఓసి కొరకు దరఖాస్తు చేసుకు న్నారు. అట్టి దరఖాస్తుకు స్పందించి ముందు పోకలకుంటలో వేసిన మట్టిని తొలగించాలని, తర్వాత దరఖాస్తు పెట్టుకోవాలని హెచ్చరించడంతో డి ఈఈ ఆదేశాల మేరకు వెంచర్‌ నిర్వహకులు వెంటనే పోకల కుంటలో వేసిన మట్టిని తొలగించి యధావిధిగా చేస్తున్నారని నీటి పారుదల శాఖ డిఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కబ్జా బాకసుర‌లకు భ‌యపడి వారి మామూళ్లు తీసుకుంటూ సర్వే రిపోర్ట్‌ ఆలస్యం చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పోకల కుంట , నీల కంటేశ్వర గుడి పక్కన ఉన్న ఎల్లమ్మ కుంట లని గత నెల 29వ తేదీ న నీటిపారదలశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్‌ సర్వే నిర్వహించారు. 9 రోజులు గడుస్తున్న ఇంకా సర్వే రిపోర్ట్‌ రాకపో వడంతో రెవెన్యూ అధికారులు కబ్జా దారుల వద్ద ముడుపులు తీసుకొని రిపోర్ట్‌ ఇవ్వడానికి కాలయాపన చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తు న్నారు. సర్వే రిపోర్ట్‌ వచ్చిన వెంటనే కబ్జా చేసిన వారిపై కేసులు నవెూదు చేస్తానని నీటిపారదలశాఖ అధికారులు డిఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement