భోపాల్: అమెజాన్‌పై మరో కేసు నమోదైంది. ఆన్‌లైన్‌లో విషం అమ్ముతోందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్నఇండోర్‌లో 18ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం కొనుగోలు చేసి, దాన్ని సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత ఈ -కామర్స్ సంస్థ అమెజాన్‌పై చట్టపరంగా చర్యలకు శ్రీకారం చుట్టింది.
బాలుడి తల్లిదండ్రులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తాజాగా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని హోంమంత్రి మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అమెజాన్ నిర్వాహకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని ఆదేశించినట్లు నరోత్తమ్ మిశ్రా గురువారం ఇండోర్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతకు ముందు నవంబర్ 16న భింద్ జిల్లా పోలీసులు ఆన్‌లైన్‌లో గంజాయిను విక్రయిస్తున్నట్లు కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను
అరెస్టు చేసిన విషయం తెలిసిందే.