ఇంటర్ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఉయ్యూరు మండలం ఆకునూరు అంబేద్కర్ నగర్ లో స్థానిక విద్యార్థినిపై కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కన్నేశాడు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.
దీంతో బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు సుబ్రహ్యణ్యం అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి కుటుంబం వెంటనే 112కు కాల్ చేశారు. ఫోన్ చేసిన నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి వివరాలు సేకరించారు. నిందితుడు సుబ్రహ్మణ్యంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యం కోసం గాలిస్తున్నారు.
- Advertisement -