Thursday, November 21, 2024

ఏపీలో ప్రధాని పర్యటించాలి, పోలవరం ముంపు ప్రాంతాలను ఆదుకోవాలి: సీపీఐ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గోదావరి ఉధృతితో వరద ముంపునకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించి స్వయంగా నష్టాన్ని అంచనా వేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన రామకృష్ణ, ప్రధాని మోదీ వివక్షాపూరిత విధానాలను తప్పుబట్టారు. గుజరాత్‌లో వరదలు వస్తే ప్రధాని వెళ్తారని, కానీ ఏపీని మాత్రం పట్టించుకోరని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి వరదలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.

దాదాపు 500 గ్రామాలు నీట మునిగాయని తెలిపారు. వరదల కారణంగా పోలవరం కాఫర్ డ్యామ్ ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి కేంద్రానికి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement