Thursday, November 21, 2024

కరోనా కట్టడి ఎలా?.. సీఎంలతో మోదీ సమావేశం!

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. గతంలో ఎప్పుడు నమోదు కానీ విధంగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే లక్షకుపైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు కఠినం చేశాయి. మహారాష్ట్రలో పాక్షికంగా లాక్ డౌన్ కూడా విధించారు. దేశంలో కేసుల తీవ్ర‌త ఇలాగే పెరిగితే.. కేసులు అదుపు చేయలేని పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ఇప్పటికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పష్టం చేశాయి. అయితే, కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈనేపథ్యంలో ఏప్రిల్ 8న ప్రధాని మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ‌ర్చువ‌ల్ సమావేశం కానున్నారు.

దేశంలో క‌రోనా ఆంక్ష‌లు ఎలా ఉండాలి? ఆర్థిక‌రంగంపై ప్ర‌భావం ప‌డ‌కుండా క‌రోనాను ఎలా అదుపు చేయాలి? వ్యాక్సినేష‌న్ వేగంతో సాగాలంటే ఏం చేయాలి? తదితర అంశాలపై ప్రధాని సీఎం అంశాల‌పై ప్ర‌ధాని సీఎంల‌తో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement