Saturday, November 23, 2024

మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: అసదుద్దీన్ ఒవైసీ

దేశంలో కొవిడ్ సంక్షోభం తీవ్ర రూపుదాల్చడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రజలకు ఆక్సిజన్ సమకూర్చడం, వ్యాక్సిన్లు అందించడం, ప్రాణాధార ఔషధాలు, వైద్యచికిత్స వ్యవస్థలను అందబాటులోకి తేవడం ప్రధాని బాధ్యత అని ఒవైసీ వ్యాఖ్యానించారు. కానీ ప్రధాని అసమర్థత, తన విధుల పట్ల నిర్లిప్తత కారణంగా దేశంలో వేలమంది చనిపోతున్నారని ఆరోపించారు. కరోనా విషయంలో సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని ఓవైసీ మండిపడ్డారు. కేవలం రెండు సంస్థలు 130 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఎలా అందిస్తాయని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈవిధంగా కొనసాగితే ప్రజలకు టీకా అందేసరికి రెండేళ్ల సమయం పడుతుందని చెప్పారు. ఇలోపు ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోవాలని ఓవైని నిలదీశారు. పెరుగుతున్న కరోనా మృతదేహాల తాకిడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాలు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement