ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. చారిత్రక హిందూ దేవాలయాలను మోదీ సందర్శించి… ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన సత్కిరా జిల్లా ఈశ్వరీపూర్ లోని జెశోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించుకున్నారు.
అమ్మవారి ఆలయంలో కలయ తిరిగిన మోదీ.. తరువాత ప్రత్యేక పూజలు చేశారు. మోదీకి ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయం లోపలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించిన ప్రధాని.. ప్రార్థనలు చేశారు. అర్చకుడు పూజులు చేసేటప్పుడు నేలపై కూర్చున్నారు. భారత్, సరిహద్దు దేశాల్లో ఉన్న 51 శక్తి పీఠాల్లో జెశోరేశ్వరీ కాళీ ఆలయం ఒకటి. దీన్ని 16 వ శతాబ్దంలో హిందూ రాజు నిర్మించినట్లు ఇతిహాస గాథల్లో ఉంది. మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ఆలయం వద్ద బంగ్లాదేశ్ ప్రభుత్వం అదనపు భద్రతా చర్యలు తీసుకుంది.