భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు దేశ ప్రజలు పట్టం కట్టారు. ప్రపంచంలోని 13 మంది దేశాధినేతల్లో అత్యధిక అప్రూవల్ రేటింగ్ సంపాదించారు. 70 శాతం మంది ప్రజలు మోదీ పాలనను సమర్థించారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మోర్కెల్‌తో పోలిస్తే.. మోదీనే ముందంజలో ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్రూవల్ రేటింగ్ కేవలం 40 శాతంగా నమోదైనట్లు మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ, తాలిబన్ల ఆక్రమణ వంటి పరిణామాల మధ్య బైడెన్ రేటింగ్ తగ్గినట్లు తెలుస్తోంది.వ్యతిరేకతా తక్కువేఅదే సమయంలో మోదీ డిస్అప్రూవల్(పాలనపై అసమ్మతి వ్యక్తం చేసినవారు) రేటింగ్ ప్రపంచంలోనే అతితక్కువగా ఉండటం విశేషం. 25 శాతం మంది మాత్రమే ప్రధానికి ప్రతికూలంగా ఓటేశారు.2019 ఆగస్టులో మోదీ రేటింగ్ 82 శాతంగా ఉంది. కరోనా రెండో వేవ్ సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో ఇది 66 శాతానికి పడిపోయింది. వైరస్ తగ్గుముఖం పట్టడం, టీకాలు అందుబాటులోకి రావడం వల్ల.. గత రెండు నెలలుగా మోదీ రేటింగ్ మెరుగవుతూ వస్తోంది.