Tuesday, November 19, 2024

BREAKING : ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప్ర‌ధాని

దేశ వ్యాప్తంగా 18 లోక్ సభకు సంబంధించి 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. మూడో దశలో అసోంలో నాలుగు, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌గఢ్‌లో ఏడు, గోవాలో రెండు, గుజరాత్‌లో 26, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్‌లో 4 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఉద‌యం అహ్మాదాబాద్‌లో ప్ర‌ధాని మోదీ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

గుజరాత్‌లోని 25 స్థానాలకు ఒకే దశలో జరిగిన ఓటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే మోదీ పోలింగ్ బూత్‌కు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ పోలింగ్ బూత్‌కు చేరుకున్నప్పుడు గాంధీనగర్ లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పోటీ చేస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అక్కడే ఉన్నారు.


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో ప్రజలు మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ కూడా అనేక సంస్కరణలను తెచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య బలాన్ని కాపాడాలని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టవంతమైన ఎన్నికల ప్రక్రియ భారత్ లోనే జరుగుతుందని మోదీ తెలిపారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement