Saturday, November 23, 2024

పంచాయతీ ఆఫీసు నుంచి మోదీ ఫొటో తొలగింపు.. ఆందోళనకు దిగిన బీజేపీ

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లలూరు పట్టణ పంచాయతీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోని ఓ వార్డు సభ్యుడు తొలగించాడు. దీంతో బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. ఇటీవల బిజెపి సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గదిలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని వేలాడదీశారు. అనంతరం వార్డు సభ్యుడు కనగరాజ్‌ ఆ ఫొటోని తొలగించారు. కనగరాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినప్పటికీ ఆయనకు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మద్దతు ఇచ్చింది.

ఆ ప్రాంతంలోని బీజేపీ సభ్యులు కనగరాజ్‌పై పోతనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రధాని చిత్రపటాన్ని తొలగించినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ప్రధాని ప్రతిష్టకు సంబంధించిన ఘటన ఇది మొదటిది కాదు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక వ్యక్తి పీఎం  మోదీ చిత్రపటాన్ని తొలగించకపోతే ఇంటి నుండి గెంటివేస్తామని తన ఇంటి యజమానులు బెదిరించారని ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement