యాస్ తుఫాను ప్రభావిత ప్రధాని మోదీ ఇవాళ పర్యటించనున్నారు. యస్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో తుఫాను ప్రభావంపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మొదట ఢిల్లీ నుంచి భువనేశ్వర్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ సమీక్ష జరిపి, బాలాసోర్, భద్రక్ తదితర ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్తారు. ఆ తర్వాత బెంగాల్లోని పశ్చిమ మేదీనిపూర్ జిల్లాలోని కలైకుండకు చేరుకుంటారు. సీఎం మమతా బెనర్జీ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మమత, సీఎస్ బండియోపాధ్యాయతో కలిసి పూర్బా మేదినీపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement