Friday, November 22, 2024

National : మోదీ భూటాన్ పర్యటన వాయిదా

ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా పడింది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనను ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా వేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ, భూటాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ హిమాలయ దేశమైన భూటాన్‌లో రెండు రోజులు పర్యటించాల్సి ఉంది. “పారో విమానాశ్రయంపై కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2024 మార్చి 21-22 తేదీలలో భూటాన్‌లో ప్రధాని పర్యటనను వాయిదా వేయాలని పరస్పరం నిర్ణయించుకున్నారు. దౌత్య మార్గాల ద్వారా ఇరుపక్షాలు కొత్త తేదీలను రూపొందిస్తున్నాయి” అని అధికారులు తెలిపారు.

- Advertisement -

మోదీ పర్యటన భారత్, భూటాన్ మధ్య సాధారణ ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. పొరుగుదేశ ఫస్ట్ పాలసీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అని పత్రికా ప్రకటన తెలిపింది. ప్రధానమంత్రి పర్యటనకు ముందు దేశానికి స్వాగతం పలికేందుకు పర్వత రహదారులపై భారీ పోస్టర్లు వెలిశాయి.

నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీకి ప్రాధాన్యతనిస్తూ న్యూఢిల్లీ, థింపూ మధ్య జరిగే ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా ఈ పర్యటన ఉందని భారత ప్రభుత్వం ఇంతకు ముందు పేర్కొంది. భూటాన్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం మోదీ.. ఆ దేశ ప్రధాని అయిన షెరింగ్ టోబ్‌గేతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందని ఎంఈఏ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement