రాంలల్లాకు పట్టాభిషేకం చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యకు రానున్నారు. రాముడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత, ప్రధాని మోదీ లతా మంగేష్కర్ చౌక్ నుండి సుగ్రీవ్ ఫోర్ట్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అయోధ్య పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. దీనికి ముందు నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్యలో మొదట రామలాలా స్వామిని దర్శించుకుని, ఆ తర్వాత రోడ్ షో నిర్వహిస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల మొదలైన తర్వాత ప్రధాని తొలిసారిగా అయోధ్యకు వెళ్తున్నారు.
ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన అయోధ్యకు వెళ్తున్నప్పటికీ, ఆయన కార్యక్రమానికి ముందు రామాలయంలో రామలాలా స్వామిని దర్శించుకుంటారు. అయోధ్య చేరుకున్న తర్వాత, ప్రధాని రామాలయంలో ప్రార్థనలు చేస్తారు, ఆపై ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇటావా చేరుకుంటారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు, ప్రధానమంత్రి ధౌరహర లోక్‌సభ నియోజకవర్గానికి బయలుదేరి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీని తర్వాత, ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకుంటారు.
రాత్రి 7 గంటలకు రామాలయంలో రామలాలా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అయోధ్యలో దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా నిర్వహించనున్నారు ప్రధాని ప్రధాని మోదీ మే 5వ తేదీ సాయంత్రం 6:40 గంటలకు సీతాపూర్‌లోని ధౌరహర హెలిప్యాడ్ నుంచి ఎంఐ-17 హెలికాప్టర్లో సాయంత్రం 5:35 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 6:45 గంటలకు బయలుదేరి ఏడు గంటలకు రామజన్మభూమికి చేరుకుంటారు. రాత్రి 7 నుంచి 7:15 వరకు రాంలాలా ఆలయంలో ఉంటారు. ఇక్కడ దర్శనం, పూజలు చేసిన తరువాత, రాత్రి 7:15 గంటలకు రామజన్మభూమి మార్గం సమీపంలోని సుగ్రీవ కోట నుండి రోడ్ షో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి లతా మంగేష్కర్ చౌక్‌కు రెండు కిలోమీటర్ల దూరం ఒక గంటలో చేరుకుంటారు. లతాచౌక్‌లో రోడ్ షో ముగించుకుని రాత్రి 8:20 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఇక్కడి నుంచి రాత్రి 8:40 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన బీబీజే విమానం ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు వెళ్లారు.