కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టినప్పటికి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మహమ్మారి వేధిస్తూనే ఉంది…ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రతో పాటు అటు ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రధాని మోదీ ఈ రోజు ఆయా రాష్ట్రాల సీఎంలతో భేటీ కాబోతున్నారు. అంతేకాదు కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో ప్రధాని మోడీ ఈరోజు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. సమావేశంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పన, ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం, వైద్యసదుపాయాల పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. అదేవిధంగా, కరోనా నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేందుకు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంది అనే విషయాలపై చర్చించే అవకాశం ఉన్నది.
ఇది కూడా చదవండి : రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు!