ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక సందేశాన్ని అందించారు. ‘క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియాలో ఇలా క్షేత్రస్థాయిలో అద్భుతమైన పనులు చేస్తున్న నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నా.. సాధారణంగా వాళ్లు ఎవరికీ తెలియకుండా ఉండిపోతారని ట్విటర్‌లో మోదీ అన్నారు. ‘సమాజంలో ఇలాంటి ఎంతో మంది వ్యక్తులను మనం చూడము, వారి గురించి వినం. అలాంటి వ్యక్తుల గురించి మీకు తెలుసా? వాళ్లను మీరు పీపుల్స్ పద్మ కోసం నామినేట్ చేయండి’ అని పేర్కొన్నారు.
నామినేషన్లు సెప్టెంబర్ 15 వరకూ తెరిచే ఉంటాయన్నారు. http://padmaawards.gov.in లోకి వెళ్లి మీరు ఆ వ్యక్తులను నామినేట్ చేయవచ్చని మోదీ చెప్పారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ నిలుస్తాయి. మోదీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇలా క్షేత్రస్థాయిలో సేవలు చేస్తూ బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఎంతో మంది వ్యక్తులకు పద్మ అవార్డులు ప్రకటిస్తోంది.
ఇది కూడా చదవండి: 2023లో రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్