అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ముందు పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు మోదీ. రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోటిలో ఇవాళ మోదీ కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. దండరామస్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. దీంతో మోదీ యాత్ర ముగుస్తుంది.
రేపు ఉదయం అయోధ్య వాల్మీకి ఎయిర్ పోర్ట్ కు ప్రధాని మోడీ రానున్నారు. అయోధ్యలో రేపు మహత్తర ఘట్టం జరుగనుంది. బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో.. రేపు ఉదయం ఢిల్లీ నుంచి అయోధ్య వాల్మీకి ఎయిర్ పోర్ట్ కు మోడీ రానున్నారు. అనంతరం గర్భగుడిలో వేదమంత్రాల మధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంవలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. సత్సంగులు, సాధువులతో ఆలయంలోనే సమావేశం అవుతారు.
వీవీఐపీ, విదేశీ ప్రతినిధులకు ప్రధాని మోడీ పలకరింపులు ఉంటాయి. కాగా అయోధ్యలో రాముడి దర్శనానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఎంతమంది వచ్చినా ఉచిత దర్శనం కల్పించనుంది. ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకే తరహా దర్శనానికి ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనంతో పాటు ప్రసాదం కూడా ఉచితంగానే అందించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఉచిత వసతి కల్పనపైనా ఆలోచనలు చేస్తున్నారు.